ఒక నిమ్మ బద్దను తీసుకుని తరచుగా గోళ్లను బాగా రుద్దితే రఫ్ నెస్ పోయి, గోళ్లు సాఫ్ట్ గా అవుతాయి. తిరిగి తెలుపును సంతరించుకుంటాయి.అలాగే రోజూ గోళ్లను టూత్ పేస్టుతో రుద్ది కడిగితే రంగు మారిన గోళ్లు మళ్లీ తెల్లగా అవుతాయి. అలాగే బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి రుద్దుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది.అలాగే ఎప్పుడు గోళ్లరంగు వేసుకోకుండా అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ రిమూరవ్ లో దూదిని ముంచి గోళ్లను రుద్దినా కూడా సమస్య తీరుతుంది.గోళ్లు తెల్లగా కాంతివంతంగా మారతాయి.గోళ్లను తేనెలో ముంచి దూదితో బాగా రుద్ది కడగాలి. తరచూ ఇలా చేస్తూ ఉంటే రఫ్ గా ఉన్న గోళ్లు స్మూత్ గా అవుతాయి.
అలాగే దూదిని చిన్న చిన్న ఉండలుగా చేసి పాలలో ముంచండి. వీటిని గోళ్ల మీద పెట్టి కాసేపు అలానే వదిలేయాలి. తరువాత తీసేసి చల్లని నీటితో కడిగేసి, ఆపైన మాయిశ్చరయిజింగ్ క్రీమ్ తో గోళ్లను కాసేపు రుద్దాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తూ ఉంటే గోళ్లు రఫ్ గా అవ్వవు. రంగు మారవు. ఆల్రెడీ ఆ సమస్యలు ఉంటే తీరిపోతాయి.ఈ చిట్కాలు పాటించడానికి ఎటువంటి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలిసిన పని లేదు.. అలాగే ఖర్చు లేదు. మన ఇంట్లోనే దొరికే సహజ పదార్ధలను ఉపయోగించి గోళ్ల సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ ఏం చేసినా గోళ్ల రంగు మారకపోతే ఒకసారి డాక్టర్ ని సంప్రదించండి. ముఖ్యంగా గోళ్లు పసుపు రంగులోకి మారిపోయాయంటే అది అనారోగ్యం సూచన కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకండి.అలాగే గోళ్లు పాలిపోయి బాగా తెల్లగా ఉంటే రక్తహీనత ఉన్నట్లు కూడా గుర్తించాలి.. !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి