"స్త్రీ ఈమె లేకపోతే జననం లేదు
స్త్రీ లేకపోతే గమనం లేదు
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు"
 
అనాది కాలం నుండి స్త్రీలు తమ ఉనికిని, ప్రతిభని చాటుకుంటూనే ఉన్నారు. తాము ఎందులోనూ తక్కువకామని ఈ లోకానికి చాటి చెబుతున్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరుల్లో మహిళా వీరమణులు కూడా ఉన్నారు. మహిళలు అనాగరిక ఆచారాల నుండి బయటపడి తమని తాము నిరూపించుకున్నారు. నాయకురాలిగా, రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా, ఐఏఎస్ గా, ఐపీఎస్ గా ఇంకా ఎన్నో అత్యున్నత పదవులను అలంకరిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. క్రీడ, రాజకీయం, శాస్త్ర, సాంకేతిక రంగాలు ఇలా అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. సాధారణ ఊహాగానాలకు భిన్నంగా దేశంలో అధికశాతం మహిళలు వివిధ రంగాలలో అద్భుతంగా రాణిస్తూ అబ్బురపరుస్తున్నారు.

పురుషులతో సమానంగా జీతాలు, పదవులలో రాణిస్తున్నారు. వ్యాపార రంగాలలోనూ పట్టు సాధించి సక్సెస్ ను అందుకుంటున్నారు. ఇంతటి ఉన్నత స్థానాలను అందుకుంటున్నప్పటికీ ఒక తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురిగా జీవన ప్రయాణంలో స్త్రీలు తమ భాద్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో గుర్తింపు తెచ్చుకుంటూ సాధికారతకు నిదర్శనంగా నిలచి మన్నలను అందుకుంటున్నారు.  అయినా  ఇప్పటికీ సమాజంలో స్త్రీ అంటే ఎంతోకొంత చులకన భావం ఉంది. స్త్రీపై జరిగే పలు రకాల అన్యాయాలు నిత్యం వెలుగులోకి వస్తూ అందర్నీ కలత పెడుతున్నాయి.

సమాజంలో మహిళల విషయంలో మారాల్సిన అంశాలు కొన్ని మిగిలే ఉన్నాయి.  ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అంశం

**యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతా...*

ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు, సర్వ శుభాలు కలుగుతాయి, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఎక్కడైతే స్త్రీలు పూజింప బడరో, గౌరవింపబడరో అక్కడ  ఆనందానికి తావులేదు. అక్కడ జరిగే సత్కర్మలకు విలువ లేనేలేదు.  స్త్రీని పూజించకపోయినా పర్వాలేదు గౌరవించండి.

ఇప్పుడు లోకమంతా మీతోనే ఉంది. ఓ స్త్రీ... రేపటి లోకం మీదే...!

మరింత సమాచారం తెలుసుకోండి: