టివిఎస్ నుండి కొత్త అకుల 310 రిలీజ్ కు రెడీ అవుతుంది. మార్కెట్ లో రిలీజ్ అయిన బైకులకు తీసిపోని విధంగా ఫుల్లీ కూల్డ్ లిక్విడ్, ఫ్యుయెల్ ఇంజెక్టెడ్, సింగిల్ సిలిండర్ మోటార్ తో రాబోతున్న ఈ బైక్ ఎంతో అధునాతనంగా తయారు చేయబడింది. 2016 ఆటో ఎక్స్ పోలో చూపరులను ఆకట్టుకున్న టివిఎస్ అకుల 310 ఇప్పుడు రిలెజ్ కు రెడీ అయ్యింది.

బిఎండబల్యు జి 310 ఆర్ యొక్క ప్రమాణాలతో వస్తున్న ఈ బైక్ 313 సిసి కెపాసిటీతో వస్తున్న ఈ బైక్ ధర 2 లక్షల రూపాయలుగా నిర్ణయించబడింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అన్ని మోడల్స్ కు పోటీగా టివిఎస్ ఈ సరికొత్త అకుల 310ని రిలీజ్ చేస్తుంది. మార్చ్ కల్లా ఈ బైకులు రోడ్ మీద వస్తాయట.