వయసుతో పని లేకుండా ఎవరైనా బండి తోలచ్చు. అయితే కొన్ని బండ్లు మాత్రమే వాళ్ళు తొలగలరు. కొంచం వయసు ఉంటే కనీసం బులెట్ బైక్ కూడా నడపలేరు. అయితే ఎవరైనా అంటే 15 ఏళ్ళ వయసు ఉన్న పిల్లాడి నుండి 60 ఏళ్ళ వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరు ఈజీగా  నడపగలిగేది స్కూటీ. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

అలాంటి స్కూటీలలో ఎన్నో రకాల స్కూటీలు ఉన్నాయ్. దాని లిస్ట్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి. కుదిరితే స్కూటీ కొని రై రై అని నడిపేయండి. వయసుతో పని లేకుండా నడపగలిగే బైక్ లు ఇవే. 

 

​హోండా యాక్టివా 6జీ..

 

ఈ వాహనం గతేడాది సెప్టెంబరులో భారత మార్కెట్లో విడుదలైంది. ఇంకా ఈ బైక్ లీటరుకు గరిష్ఠంగా 60 కిలోమీటర్ల మైలేజినిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ బైక్ ధర రూ.67,490 నుంచి 74,500 రూపాయల మధ్య ఉంది.

 

​టీవీఎస్ జూపిటర్..

 

బీఎస్6 పరిణామాలతో ఉన్న ఈ బైక్ ఎక్స్ షో రూమ్ లో టీవీఎస్ జూపిటర్ ప్రారంభ ధర రూ.61,449 గా నిర్ణయించారు. ఇంకా ఈ బైక్ మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. 

 

​హీరో డెస్టినీ 125..

 

ఈ సరికొత్త స్కూటర్ ఇటీవలే లాంచ్ అయ్యింది. అయితే ఈ బైక్ ధర రూ.64,310గా నిర్ణయించారు. ఇంకా ఈ బైక్ లీటరకు 54 కిలోమీటర్లు మైలేజి ఇస్తుంది. 

 

​బీఎస్6 సుజుకీ యాసెస్ 125..

 

ఈ స్కూటర్ ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల అయ్యింది. ఇంకా ఈ బైక్ ధర రూ.64,800 నుంచి రూ.69,500 మధ్య నిర్ణయించారు. 

 

​యమహా ఫ్యాసినో 125..

 

ఈ స్కూటర్ ను గత సంవత్సరం డిసెంబరులో బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్ డేట్ చేసి లాంచ్ చేశారు. అయితే ఈ బైక్ ధర ప్రస్తుతం రూ.66,430 నుంచి 69,430 మధ్య నిర్ణయించారు. 

 

చూశారుగా ఈ బైక్స్ ఏ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే బైక్స్. మరి ఇంకేందుకు ఆలస్యం మీకు నచ్చిన బైక్ తీసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: