బజాజ్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే ఎన్నో రకాల వాహనాలను మార్కెట్ లోకి విడుదల చేసింది. చిన్న నుంచి భారీ వాహనాలను జనాలకు అందించిన ఘనత ఈ కంపెనీకి ఉంది. ఎప్పటికప్పుడు యూత్ పల్స్ ను తెలుసుకుంటూ కొత్త ఫీచర్లు ఉన్న వాహనాలను అందిస్తుంది. ఇప్పుడు మరో కొత్త వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేశారు.. కేవలం ఈ బైక్ పేరుకే క్రేజ్ పెరిగింది.. అంటే ఇంక బైక్ పూర్తి వివరాలు చూస్తే ఏమంటారో చూడాలి..


బజాజ్ ఆటోమొబైల్స్‌.. తన కస్టమర్ల కోసం ‘పల్సర్’ శ్రేణిలో సరికొత్త మోడల్మోటారు సైకిల్‌ను విడుదల చేయనున్నది. ‘నెక్ట్స్ జనరేషన్ పల్సర్-250సీసీ అనే పేరుతో ఈ బైక్‌ మార్కెట్లోకి రానున్నది. ఈ బైక్ లో సౌకర్యవంతమైన సీటింగ్తో ఉండే బైక్ డిజైన్.. వాహన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుందని సంస్థ తెలిపింది. ఎన్ఎస్/ ఆర్ఎస్ అనే రెండు మోడల్స్లో పల్సర్ 220సీసీ రానున్నట్లు తెలుస్తున్నది.సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, బాడీ ప్యానెల్స్ ‌తో కూడిన ఇంధన ట్యాంక్, టాప్-అప్ పిలీయన్(వెనక) సీటు, కొత్త ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్, కనెక్టివిటీ టెక్నాలజీ, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ఆయిల్-కూల్డ్ ఇంజిన్ తదితర ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి..


సరికొత్త ఫీచర్లతో యూత్ ను ఆకర్షిస్తున్న ఈ బైక్ యొక్క షో రూం ధర రూ.1.20 లక్షలపైనే ఉండొచ్చునని అంచనా. ఇంతకుముందు మోడల్ బైక్‌ల కంటే చౌకగా, తేలిగ్గా దీన్ని కొనుగోలు చేయొచ్చు.ఎప్పుడు ఈ బైక్ మార్కెట్ ‌లోకి వస్తుందన్న సంగతి వెల్లడించకున్నా.. ఈ ఏడాది పండుగ సీజన్‌లో అంటే దీపావళి నాటికి ఈ మోటారు బైక్‌ను బజాజ్ ఆటోమొబైల్స్‌ విడుదల చేయనున్నట్లు తెలిసింది.. మొత్తానికి సరికొత్త ఫీచర్లతో వస్తున్న ఈ బైక్ కు మంచి డిమాండ్ కూడా భారీగా ఏర్పడుతుందని తెలుస్తుంది. మరి సేల్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: