ప్రముఖ జపాన్ బైక్ కంపెనీ హోండా తన టూ వీలర్ వాహనాలపై ఇప్పుడు అదిరిపోయే డిస్కౌంట్స్ అందిస్తోంది. కరోనా మహమ్మారి అధికంగా విజృంభిస్తున్న ఈ సమయంలో కూడా చాలా కంపెనీలు తమ వాహనాలపై చాలా డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఈ విధంగా డిస్కౌంట్స్ ప్రకటించిన కంపెనీలలో హోండా మోటార్ బైక్స్ కంపెనీ ముందంజలో ఉంది. ఇప్పుడు కూడా హోండా బైక్ తయారీదారు తమ వాహనాలపై మంచి డిస్కౌంట్స్ ప్రకటించడం జరిగింది.ఇక హోండా కంపెనీ ఇంతకు ముందు హోండా యాక్టివా, హోండా గ్రాజియా అలాగే హోండా ఎక్స్-బ్లేడ్‌ వంటి వాటిపై డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఇదే నేపథ్యంలో హోండా కంపెనీ ఇప్పుడు తన 110 సిసి బైక్ హోండా లివో బైక్ పై కూడా ఇటీవల సూపర్ డిస్కౌంట్ ఆఫర్ ప్రవేశపెట్టడం జరిగింది.



ఇక  ఈ సంవత్సరంలో హోండా కంపెనీ ఇప్పుడు  జూన్ నెలలో హోండా లివా కస్టమర్ల కోసం రూ. 3,500 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.ఇక ఈ సూపర్ ఆఫర్ ఎస్బిఐ క్రెడిట్ కార్డుతో ఈఎమ్ఐ ద్వారా బైక్ ని కొనే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇక అంతే కాకూండా మీరు క్రెడిట్ కార్డు ద్వారా కనీసం 40,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది.ఇక అంతేగాక ఈ సరికొత్త హోండా లివా బైక్ కొనుగోలు చేసినప్పుడు, దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా పూర్తవుతుంది. ఇక అలాగే ఇంకో విషయం ఏమిటంటే డౌన్ పేమెంట్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మీరు మీ సమీపంలో వున్న డీలర్‌షిప్‌ను లేదా ఆన్‌లైన్‌ను సందర్శించడం ద్వారా ఈ ప్రాసెస్ ని సులభంగా పూర్తి చేయవచ్చు.ఇక హోండా కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ జూన్ 30 దాకా మాత్రమే చెల్లుబాటు అవుతుందట.కాబట్టి ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు 2021 జూన్ 30 లోపు కొనుగోలు చేసుకోవాలట. ఇక ఈ ఆఫర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మీరు మీ దగ్గర్లో ఉన్న హోండా డీలర్షిప్ సందర్శించి పూర్తి విషయాలని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు.ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి.


మరింత సమాచారం తెలుసుకోండి: