కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారత భూభాగంలోకి 1,200 కిలోమీటర్ల దూరం చైనా చొరబడిందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.పంజాబ్​లో గతవారం మీడియాతో మాట్లాడుతూ.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ ఆరోపించారు. 1,200 కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు భారత్ అప్పగించిందన్నారు.


దీనిపై స్పందించిన రాజ్​నాథ్​.. భారత్​ నుంచి ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణ జరగలేదని స్పష్టం చేశారు. దేశ సమగ్రత విషయంలో కాంగ్రెస్ ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదన్నారు.జమ్ముకశ్మీర్​ పుల్వామాలో సీఆర్​పీఎఫ్​ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడికి తామే బాధ్యులమని పాక్​ నేత ఫవాద్ పార్లమెంటు సాక్షిగా అంగీకరించారు. పైగా పిరికిపందలా దాడి చేయడాన్ని తమ ప్రభుత్వ విజయంగా అభివర్ణించారు. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలో సాధించిన ఈ విజయంలో మనమంతా భాగస్వాములేనని అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: