ఇక ప్రముఖ తెలుగు సినీ నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల విషయంలో ఇండస్ట్రీలో బాగా వివాదాస్పదమైంది. ఇక మా ఎన్నికలు ప్రస్తుతం చాలా హోరా హోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నటి పూనమ్ కౌర్ ప్రకాష్ రాజ్ కి తన మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఈ అమ్మడు ట్వీట్ చేసింది.

ఈ మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని కోరుకుంటున్నాను.నేను చాలా కాలం నుంచి కూడా ఎదుర్కొంటున్న సమస్యలను ప్రకాష్ రాజ్ గారికి విన్న విస్తాను.ఎందుకంటే ప్రకాష్ రాజ్ మాత్రమే వాస్తవికంగా ఉంటాడు.అంతేగాక ప్రకాశ్ రాజ్ పెద్దల పట్ల గౌరవాన్ని ఇంకా అలాగే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు.ఇక ముఖ్యంగా ప్రకాశ్ రాజ్ ఎలాంటి చెత్త రాజకీయాలు అనేవి చేయరు. అని ఈ ముద్దుగుమ్మ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

 

 https://twitter.com/poonamkaurlal/status/1443931761092685831?s=19

మరింత సమాచారం తెలుసుకోండి: