టీ షర్టుల మీద ఉన్నటువంటి  ప్రింటింగ్ లను మీరు ఎప్పుడైనా గమనించారా..? కొన్ని టీషర్టులపై  ఏదో మామూలుగా టెక్స్ట్  రాసి ఉంటుంది. మరికొన్ని టీ షర్ట్ మీద అయితే కొన్ని కంపెనీల బ్రాంచ్ పేర్లు కూడా ఉంటాయి. ఒకప్పుడు ఈ యొక్క టీషర్టలను ఎక్కువగా వేసుకునే వారు కాదు.కానీ  టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరు కంఫర్ట్ గా ఉండే టీ షర్ట్స్ వేసు కుంటున్నారు. టీ షర్ట్స్ కి ఇంత క్రేజ్ ఉందంటే యువతలే కాకుండా మహిళలు, ముసలివాళ్ళు ప్రతి ఒక్కరు టీషర్ట్ ను వేసుకుంటున్నారు. అందుకే కొన్ని కంపెనీలు ఈ టీషర్టులపై తమ యొక్క బ్రాండ్ పేరును వేసుకుంటున్నాయి. అయితే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది వీటిపై పెద్ద బిజినెస్ అయిపోయింది.
అయితే  కొన్ని కంపెనీలు వారి బ్రాండ్స్ ప్రమోషన్స్ కోసం ఈ యొక్క ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లను వేయిస్తున్నారు. ఉదాహరణకు ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్  ప్రమోషన్స్ కోసం కొన్ని టీషర్టులపై సినిమా ప్రింటింగ్ చేయించింది. దీంతో పాటు అల్లు అర్జున్ సినిమా పుష్ప లోని తగ్గేదేలే డైలాగ్ పేరుతో కూడా కొన్ని టీషర్ట్లు బయటకు వచ్చాయి. అలాగే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్ బుక్, ఇంకా కొన్ని సోషల్ మీడియా యాప్ లు  వారి యొక్క బ్రాండ్స్ పేరును టీషర్టులపై ప్రింటింగ్ వేయించుకుంటారు. అయితే ఈ ప్రింటెడ్  పెయింటింగ్ ను వేయడం  కోసం ఒక మిషన్ అవసరం ఉంటుంది. దాని ధర కూడా  20 వేల లోపే ఉంటుంది. అయితే మన ఆర్డర్ అనేది ఎక్కువ మొత్తంలో ప్రింటింగ్ చేయాల్సి వస్తే దాని కోసం లక్ష రూపాయల విలువగల మిషన్ కావాలి. మనకు ఏ మిషన్ కావాలన్నా ఆన్లైన్లోనే కొనుగోలు చేయవచ్చును. ఆ తర్వాత సబ్లిమెషన్ షేప్, టేప్లను షీట్, ప్రింటింగ్ కోసం అదనంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని కొరకు మరో మూడు వేల నుంచి 4 వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈ బిజినెస్ ద్వారా  నెలకు 30 వేల నుంచి  దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.

మన టాలెంట్ ను బట్టి ఒకవేళ ఆర్డర్స్ పెరిగితే మాత్రం లక్షల్లో ఆదాయం అనేది పక్కాగా ఉంటుంది. అయితే ఈ వ్యాపారం చేయడానికి పెట్టుబడి ఒకసారి పెడితే చాలు, జీవితకాలం  డబ్బులు సంపాదించవచ్చు. ఈ యొక్క బిజినెస్ ను ఇంట్లో ఉండేటువంటి మహిళలు కూడా చేయవచ్చు. ముఖ్యంగా మీరే మార్కెట్లో దొరికే టీ షర్ట్ ను తీసుకొని కస్టమర్ కి కావాల్సిన డిజైన్లలో ప్రింటింగ్ చేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. అయితే ఈ టీ షర్టులను  ఒక్క సారి బల్క్ గా కొనుగోలు చేస్తే  చాలా తక్కువ ధరకు రావడమే కాకుండా ఎక్కువ లాభాలు కూడా వస్తాయి. ఈ వ్యాపారాన్ని మార్కెటింగ్ కొరకు ఆన్లైన్ లో కూడా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: