ఒక గ్లాసు బియ్యం, కొన్ని కర్చూరాలు వేసి మెత్తగా మరపట్టించి వాడితే చర్మం మృదువుగా వుండి శీతాగాలులకు సహజత్వాన్ని కోల్పోకుండా వుంటుంది.
పాలలో మైదా కలిపి ఫేస్ ప్యాక్ గా వారానికి రెండుసార్లు వాడాలి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కొవాలి. శుభ్రంమైన మెత్తటి తువ్వాలతో తుడుచుకోవాలి.
పాదాలకు సాక్స్ వేసుకోవటం అవసరం. పాదాల పగుళ్లు తగ్గాలంటే పెట్రోలియం జెల్లీ లేదా ఏదైనా క్రీమ్ రాసుకుని కొంతసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కొవాలి.
చలిగాలులకు చర్మంలాగానే శిరోజాలు కూడా పొడిబారినట్లు బిరుసుగా అవుతాయి. చుండ్రు పెరుగుతుంది. శిరోజాలు చివర్లు రెండు భాగాలుగా చిట్లిపోతాయి. ఈ విదమైన ఇబ్బందులను అధిగమించటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
శీతాకాలంలో చుండ్రు బాగా పెరుగుతుంది. తరుచుగా తలస్నానం చేసి చుండ్రును వదిలించుకోవాలి.
తలస్నానం చేసేటప్పడు గోరువేచ్చని కొబ్బరినూనేను మునివేళ్లతో మాడుమీద నెమ్మదిగా ఒక క్రమపద్దతిలో రుద్దాలి.
కొబ్బరినూనేలో కర్చూరాలు వేసి కాచి, ఆ నూనేను తలకు రాసుకుంటే జుట్టు మృదువుగా ఉంటుంది. శిరోజాలు చివర్లు పగలకుండా ఉంటాయి.
చివర్లు పగిలిన శిరోజాలను జాగ్రత్తగా కట్ చేయించుకోవాలి.
చిరాకుగా ఉంటుందని చాలామంది తలకు నూనే రాసుకోరు. శీతాకాలంలో తలకు నూనే రాసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకని రెండు రోజులకు ఒకసారి అయినా తలకు గోరువెచ్చని నూనె రాసుకోవాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: