ఇదే సంక్రాంతి రేసులో జనవరి 9న ప్రభాస్ నటించిన భారీ చిత్రం ‘రాజా సాబ్’ థియేటర్లలోకి రానుంది. భారీ బడ్జెట్‌తో, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అలాగే జనవరి 14న ‘అనగనగా ఒక రాజు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 13న రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ విడుదల కానుండగా, జనవరి 14 సాయంత్రం ఖచ్చితంగా 5:49 గంటలకు శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఇవే కాకుండా తమిళం నుంచి కూడా భారీ సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి.దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’, అలాగే శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ కూడా పండక్కే విడుదలకు సిద్ధమవడంతో థియేటర్ల వద్ద అసలైన పండుగ వాతావరణం నెలకొననుంది.ఒకేసారి ఏడు సినిమాలు థియేటర్లలోకి రావడం అనేది చాలా అరుదైన విషయం. బాక్సాఫీస్ పరంగా కూడా ఇది ఇండస్ట్రీకి ఒక పెద్ద పరీక్షగా మారబోతోంది.
టాప్ మోస్ట్ ట్రెండింగ్: ప్రభాస్ ‘రాజా సాబ్’
ఎన్ని సినిమాలు విడుదలవుతున్నా… అన్నిటికన్నా ఎక్కువగా టాప్ మోస్ట్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది మాత్రం ప్రభాస్ నటించిన ‘రాజా సాబ్’నే. జనవరి 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో రోజురోజుకూ హైప్ పెరుగుతోంది.ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్‌ను అభిమానులు ఏ రేంజ్‌లో చూడాలనుకున్నారో… ఆ స్థాయిలోనే మారుతి ఆయనను ప్రెజెంట్ చేశాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. కామెడీ, మాస్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ట్రైలర్‌ను కట్ చేయడంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.సోషల్ మీడియాలో ట్రెండింగ్, యూట్యూబ్ వ్యూస్, హై రెమ్యూనరేషన్, పాన్ ఇండియా క్రేజ్… ఏ కోణంలో చూసినా సంక్రాంతి బరిలో ఉన్న ఏడు సినిమాల్లో ‘రాజా సాబ్’ ముందంజలోనే ఉంది. పండగ సందడి మొత్తం ఈ సినిమాకే షిఫ్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సంక్రాంతి విన్నర్ ప్రభాస్‌నేనా..?
సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాలంటే కేవలం స్టార్ పవర్ సరిపోదు… అదృష్టం కూడా ఉండాలి. ఈసారి ఆ అదృష్టం పూర్తిగా ప్రభాస్ వైపే ఉందని ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.పాన్ ఇండియా స్టార్‌గా ఇప్పటికే భారీ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్, ఈ సంక్రాంతితో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.మొత్తానికి, 2026 సంక్రాంతి సీజన్‌లో గోల్డెన్ డీల్ కొట్టిన హీరో ప్రభాస్‌నే అని ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. నిజంగా సంక్రాంతి విన్నర్ ఎవరో అనేది జనవరి రెండో వారంలో తేలిపోనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి