టాలీవుడ్‌లో మాస్ మహారాజాగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రవితేజ మరోసారి ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా సిద్ధమవుతున్నారు. ఎనర్జీ, టైమింగ్, మాస్ అప్పీల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రవితేజ, ప్రస్తుతం తన కొత్త సినిమాలతో మంచి ఫామ్‌లోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఈ సినిమాను దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. రవితేజ మార్క్ ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు భావోద్వేగాలు కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్.


సినిమా తర్వాత రవితేజ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో మరోసారి చేతులు కలపడానికి రవితేజ సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.



గతంలో ఈ కాంబినేషన్‌లో ధమాకా (సూపర్ హిట్),ఈగిల్,మిస్టర్ బచ్చన్..వంటి సినిమాలు తెరకెక్కాయి. అయితే ‘మిస్టర్ బచ్చన్’ భారీ నష్టాలను మిగిల్చడం, ఆ సమయంలో నిర్మాత టీ.జీ. విశ్వ ప్రసాద్ చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. అయినప్పటికీ, గతాన్ని పక్కనపెట్టి మళ్లీ కలిసి పని చేయాలని ఇరు వర్గాలు ముందుకు రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి రవితేజకు ఓ పవర్‌ఫుల్ ఐడియాను వినిపించినట్లు సమాచారం. ఈ కథపై చర్చలు ప్రస్తుతం పాజిటివ్ దిశలో సాగుతున్నాయని టాక్. ఈ ప్రాజెక్ట్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ.జీ. విశ్వ ప్రసాద్ నిర్మించనుండగా, కథను ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించనున్నారని తెలుస్తోంది.



అన్ని అనుకున్నట్లుగా కుదిరితే, వచ్చే ఏడాది ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే, షూటింగ్‌ను 2026 రెండో భాగంలో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.



సురేందర్ రెడ్డివక్కంతం వంశీరవితేజ కాంబినేషన్ అంటేనే భారీ అంచనాలు ఏర్పడటం సహజం. గతంలో ‘ఇడియట్’, ‘విక్రమార్కుడు’ లాంటి సినిమాలతో రవితేజ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన మాస్ ఇమేజ్‌ను మళ్లీ ఈ సినిమా తిరిగి తీసుకువస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ ప్రాజెక్ట్ కనుక అనుకున్న విధంగా వర్క్ అవుట్ అయితే, రవితేజ ఖాతాలో ఒక బిగ్ మాస్ బ్లాక్‌బస్టర్ ఖాయం అని చెప్పాలి. ఇప్పటికే ఈ వార్త రవితేజ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుండగా, ఇందులో ఎంతవరకు నిజం ఉందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మొత్తానికి, మాస్ మహారాజా మరోసారి వెండి తెరపై తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని అప్‌డేట్స్ వస్తాయని ఆశిద్దాం..!

మరింత సమాచారం తెలుసుకోండి: