ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ఈసారి 2026 పొంగల్‌ను గట్టిగానే టార్గెట్ చేశారని తెలుస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ జనవరి 12, 2026న గ్రాండ్‌గా విడుదల కానుంది.ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, మెగాస్టార్ టైమింగ్, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ — ఇవన్నీ కలిసి ఈ సినిమాను సంక్రాంతి రేసులో ఫ్రంట్ రన్నర్‌గా నిలబెడుతున్నాయి. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి, మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.
ఇదే రేసులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తగ్గేదేలే అన్నట్టు రంగంలోకి దిగుతున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘రాజా సాబ్’ జనవరి 9, 2026న థియేటర్లలోకి రానుంది.ప్రభాస్ సినిమా అంటే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఈసారి కామెడీ, ఎంటర్టైన్మెంట్ టచ్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. చిరంజీవి సినిమాకు ముందు రిలీజ్ అవుతున్న ఈ సినిమా సంక్రాంతి వాతావరణాన్ని ముందుగానే హీట్ ఎక్కించనుంది.
సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా రవితేజ కూడా దిగుతున్నాడు. ఆయన నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13, 2026న విడుదల కానుంది.అలాగే జనవరి 14న సాయంత్రం ఖచ్చితంగా 5:49 గంటలకు, శర్వానంద్ నటించిన ‘నారి నారి నడుమ మురారి’ థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది. టైటిల్ నుంచే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతి రేసులో కీలక పాత్ర పోషించనుంది.
తెలుగు సినిమాలే కాకుండా తమిళం నుంచి కూడా భారీ సినిమాలు ఈ పండుగకు రెడీ అవుతున్నాయి. దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’, అలాగే శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ కూడా పొంగల్ కానుకగా విడుదలకు సిద్ధమవడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం పీక్ లెవెల్‌లో ఉండనుంది.ఇంతమంది స్టార్ హీరోల మధ్య సైలెంట్‌గా కానీ బలంగా దూసుకుపోతున్న సినిమా ఒక్కటి ఉంది. అదే నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమా కూడా జనవరి 14, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.నవీన్ పోలిశెట్టి సినిమా అంటేనే మినిమమ్ కామెడీ గ్యారెంటీ అనే బ్రాండ్ ఏర్పడిపోయింది. అతని టైమింగ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్—అన్ని కలిపి యూత్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటాయి. అందుకే పెద్ద స్టార్ హీరోల సినిమాల మధ్యలోనూ ‘అనగనగా ఒక రాజు’పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే —చిరంజీవి, ప్రభాస్ లాంటి మెగాస్టార్లు ఉన్నప్పటికీ, కంటెంట్ బేస్డ్ ఎంటర్టైనర్‌గా ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్‌ను సర్‌ప్రైజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని.మొత్తానికి…2026 సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు…సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద పరీక్ష,బాక్సాఫీస్‌కు ఒక యుద్ధం,ప్రేక్షకులకు ఒక మెగా ఫెస్టివల్.ఈ రేసులో ఎవరు గెలుస్తారో చూడాలి… కానీ ఒక విషయం మాత్రం ఖాయం —నవీన్ పోలిశెట్టి సైలెంట్ మిస్సైల్‌లా దూసుకుపోతున్నాడు…ప్రభాస్, చిరంజీవిలకే టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి