తెలుగు సినీ ఇండస్ట్రీకి సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద ఒక పెద్ద యుద్ధం.. ప్రతి ఏడాదిలాగే 2026 సంక్రాంతికి బడా చిత్రాలు విడుదల కాబోతున్నాయి. కానీ ఈసారి పోటీ మరింత హై లెవెల్లో ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. సీనియర్ స్టార్స్ నుంచి యంగ్ హీరోల వరకు సినిమాలను విడుదల చేస్తూ ఉండగా పైగా డబ్బింగ్ చిత్రాలకు కూడా దూకుడు ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే 2026 సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ మరింత హాట్ టాపిక్ గా మారింది. తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కలుపుకొని మొత్తం 7 సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదల కాబోతున్నాయి.


రాజాసాబ్:
ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న హర్రర్ కామెడీ థ్రిల్లర్ సినిమా జనవరి 9, 2026 విడుదల కాపోతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక కొత్త జోనర్లో కనిపించబోతున్నారు. ఇది ఈ సినిమాకి హైలైట్. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో కనిపిస్తూ ఉండడంతో అభిమానులు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.


జననాయగన్:
దళపతి విజయ్, హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇదే. ఈ సినిమా జనవరి 9న తమిళ్ ,తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఈ సినిమా విజయ్ కీ చివరి సినిమా. అందుకే అంచనాలు పెరిగిపోయాయి.రాజాసాబ్ సినిమాతో పాటు ఈ సినిమా ఒకేరోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పడం లేదు.


పరాశక్తి: 
శివ కార్తికేయన్, శ్రీలీల డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో ఈ సినిమా జనవరి 10, 2026న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకి అనుకున్నంత స్థాయిలో తెలుగులో బజ్ కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. బడా సినిమాలు విడుదలవుతుండడంతో  దీంతో పరాశక్తి సినిమాకి తెలుగులో థియేటర్స్ దొరకడం కష్టమే అని భావించిన చిత్ర బృంద విడుదల తేదీని ముందుకు జరిపినట్లుగా వినిపిస్తోంది.లేదా సినిమాని సోలోగా విడుదల చేస్తారేమో చూడాలి మరి.


మన శంకరవరప్రసాద్ గారు:
చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా 2026 జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా రాబోతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.


భర్త మహాశయులకు విజ్ఞప్తి:
మాస్ హీరో రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జనవరి 13న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కూడా కుటుంబ ప్రేక్షకుల లక్ష్యంగా చేసుకొని మరి తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. రవితేజ అభిమానులకు ఈ సినిమా పైన అంచనాలు ముఖ్య కారణం టీజర్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉండడం.


అనగనగా ఒక రాజు:
నవీన్ పోలిశెట్టి, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమాకి ముఖ్య బలం నవీన్ పోలిశెట్టి కామెడీనే.

నారి నారి నడుమ మురారి:
శర్వానంద్, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య కీలకమైన పాత్రలో నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి బజ్ బాగానే ఉంది.


ప్రస్తుతం హైప్ పరంగా చూసుకున్నట్లయితే రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలకు భారీగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని శర్వానంద్, నవీన్ పోలిశెట్టి కూడా ఆకట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.రవితేజ నటించిన భర్తమహాశయులకు విజ్ఞప్తి కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉండడంతో మంచి బజ్ ఏర్పడుతోంది. సంక్రాంతి బరిలో అన్ని  సినిమాలు అనుకున్న తేదీకి విడుదలవుతాయా? లేక వాయిదా  వేసుకొని అవకాశం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది.మొత్తానికి 2026లో మాత్రం సినీ ప్రియులకు ఫుల్ మీల్స్ గా మారబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: