టాలీవుడ్ బడా ఫ్యామిలీ నుంచి హీరోగా అడుగుపెట్టిన అల్లు శిరీష్ ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా కూడా అడపా దడపా చిత్రాలు నటిస్తున్న అల్లు శిరీష్ ఈ ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇటీవలే ఒక స్పెషల్ వీడియో షేర్ చేసి ఆ వీడియోలో తన అన్నయ్య అల్లు అర్జున్ పిల్లలతో కలిసి ఒక ఫన్ వీడియో ద్వారా తన వివాహ రిలీజ్ డేట్ ని తెలిపారు శిరీష్. అయితే ఆ డేట్ కేవలం సాధారణ డేట్ మాత్రమే కాదని ,అల్లు ఫ్యామిలి కి కూడా ఒక భారీ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. మరి ఆ డేట్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.


అల్లు శిరీష్, నయనిక రెడ్డి ఎంగేజ్మెంట్ అక్టోబర్ 31, 2025న తేదీన చాలా గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిన్నటి రోజున  వివాహ తేదీ విషయాన్ని కూడా అల్లు శిరీష్ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అల్లు అర్జున్ పిల్లలు బాబాయ్ వివాహం ఎప్పుడు అని అడగగా? మార్చి 6,2026 అని చెబుతారు. అలాగే సంగీత్ ఉంటుందా అని అడగగా.. దక్షిణాది వాళ్ళమని మన సాంప్రదాయాలు వేరేగా ఉంటాయని ఫన్నీగా తెలియజేశారు.


అలాగే మార్చి 6 ,2026 అల్లు శిరీష్, నయనిక వివాహం యాదృచ్ఛికంగా ఎంచుకున్నది కాదు.. ఈ వివాహ తేదీ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి వివాహం కూడా 2011 మార్చి 6వ తేదీని జరిగింది. వెన్యూ అవైలబిలిటీ ప్రకారం అదే తేదీని శిరీష్ ఎంచుకున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన లైఫ్ లో తన అన్నయ్య జీవితమే ఇన్స్పీరేషన్ ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. అందుకే ఆ స్పెషల్ తేదీని ఎంచుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అల్లు శిరీష్, నయనిక లవ్ స్టోరీ విషయానికి వస్తే లావణ్య త్రిపాఠి ,వరుణ్ తేజ్ వివాహ సమయంలోనే మొదలయ్యిందని 2023 నుంచి వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2025 అక్టోబర్ 31న నిశ్చితార్థం చేసుకోక, ఇప్పుడు పెళ్లి తేదీని కూడా ఫిక్స్ చేశారు. కాబోయే ఈ జంటకు అభిమానులు ముందుగానే  శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: