ఇటీవల మీనా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినీ ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీనా తన స్వభావాన్ని వివరించారు.“నేను షూటింగ్ సమయంలో ఎక్కువగా మాట్లాడే దాన్ని కాదు. చాలా సైలెంట్‌గా నా పని నేను చేసుకునేదాన్ని. చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించాను. వాళ్లంతా నాతో చాలా సరదాగా ఉండేవారు, సెట్‌లో మంచి వాతావరణం ఉండేది” అని ఆమె చెప్పారు.
ప్రత్యేకంగా బాలకృష్ణ గురించి మాట్లాడుతూ,“బాలకృష్ణ గారు సెట్‌లో అందరితో సరదాగా ఉంటారు. జోకులు వేస్తూ షూటింగ్ వాతావరణాన్ని హుషారుగా ఉంచేవారు” అని గుర్తు చేసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా మీనా చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. “మోహన్ బాబు గారు మాత్రం నన్ను కొంచెం బెదిరించేవారు” అంటూ ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
ఆ వ్యాఖ్యను వివరించుతూ మీనా,“అందుకే ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు నేను అస్సలు మాట్లాడేదాన్ని కాదు. చాలా సీరియస్‌గా కనిపించేవారు. కానీ లోపల మాత్రం సరదా మనసు ఉన్న వ్యక్తే. షూటింగ్ సమయంలో ఆయన తన పిల్లలతో ఎంతో ప్రేమగా ఆడుకున్న సందర్భాలు నాకు గుర్తున్నాయి” అని చెప్పారు.అయితే ఈ ‘బెదిరించడం’ అన్న మాటను మీనా సరదాగానే చెప్పిందా? లేక దానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అనే అనుమానాలు ఇప్పుడు నెటిజన్లలో మొదలయ్యాయి.
మీనా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో, సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.“అసలు మోహన్ బాబు మీనాను ఏ విషయంలో బెదిరించారు?”, “ఇది సరదాగా చెప్పిన మాటనా, లేక నిజంగా ఏదైనా సంఘటన జరిగిందా?”
అంటూ అభిమానులు, నెటిజన్లు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.మొత్తానికి, దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో పనిచేసిన మీనా, తన అనుభవాలను నిజాయితీగా పంచుకుంటూ మరోసారి వార్తల్లో నిలిచారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి