ఈ నేపథ్యంలో, ప్రస్తుతం బడ్జెట్ పరంగా సేఫ్‌గా ఉండే సినిమాలకే ఓకే చెబుతూ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లో పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు సిద్ధు. తాజాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా కథ పూర్తిగా వినోదంతో పాటు ఆసక్తికరమైన మలుపులతో రూపొందనున్నదని టాక్. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుండగా, ఈ వారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, అలాగే ఇందులో సిద్ధు ఇప్పటివరకు చేయని కొత్త తరహా పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ముఖ్యంగా ఈ చిత్రంలో కాంట్రవర్షియల్ అంశాలను కూడా ధైర్యంగా చూపించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి.
ఇక ఈ ప్రాజెక్ట్ అనంతరం రవికాంత్ దర్శకత్వంలో సిద్ధు సైన్ చేసిన ‘బ్యాడ్ డేస్’ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయని, సిద్ధు కెరీర్‌కు ఇది కీలక మలుపుగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వరుస ఫెయిల్యూర్స్ తర్వాత మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్న సిద్ధు జొన్నలగడ్డ, ఈ కొత్త సినిమాలతో మళ్లీ తన మార్కెట్‌ను బలపర్చుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన మరో సినిమా కి కూడా సైన్ చేసిన్నత్లు టాక్. అది కూడా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. విడాకులు తీసుకున్న స్టార్ హీరో బయోపిక్‌లో ఆయన నటించబోతున్నారట. ఇది ఎంతవరకు సంచలనంగా మారుతుందో చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి