మన ఇంట్లోనే పెద్ద ఫార్మసీ ఉంది. అదే, కిచెన్. ఎన్నోరకాల వ్యాధులను తగ్గించే మందులు మన వంటింట్లోనే ఉన్నాయి. సాధారణ సమస్యన నుంచి దీర్ఘకాలిక రోగాల బారి నుంచి కూడా అవి మనల్ని కాపాడతాయి. లవంగాలను వేయించి, పొడి చేసి తేనెతో కలిపి తాగితే, దగ్గు, కఫం తగ్గుతుంది. అరస్పూను దాల్చినచెక్క పొడిని గోరు వెచ్చని నీటితో కలిపి తాగితే అజీర్తిని పోగొడుతుంది. ఆవనూనెలో ఒక స్పూను తేనె కలిపి తాగితే ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది. మిరియాల పొడిని పాలు చక్కెరతో కలిపి తాగితే, జలుబు, దగ్గు తగ్గుతాయి. వాము పొడిలో చిటికెడు ఉప్పు, నిమ్మరసం కలిపి తాగితే కడుపునొప్పి తగ్గి, జీర్ణక్రియ పెరుగుతుంది. నువ్వులపప్పును బెల్లంతో కలిపి ప్రతిరోజూ తింటే శరీరానికి శక్తి వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: