సాధార‌ణంగా టీ అంటే చాలా మంది ఇష్టంగా తాగుతుంటారు. అందులో ముఖ్యంగా ఉద‌యం నిద్ర లేచిన త‌ర్వాత టీ తాగ‌నిదే రోజు కూడా గ‌డ‌వ‌దు కొంద‌రికి. బెడ్ కాఫీతో రోజును ప్రారంభించేవారు కూడా ఎందరో ఉన్నారు. ఇక‌ ఆఫీసుల్లో పనులతో అలసిపోయినా.. ఇంటి పనులతో తలమునకలైనా మొదటిసారిగా గుర్తొచ్చేది టీనే అంటూ అతిశ‌యోక్తి కాదు. ఓ క‌ప్పు వేడి వేడి టీ తాగడం వల్ల అప్పటి వరకూ ఉన్న ఒత్తిడి అంతా ఒక దెబ్బతో పోతుంది. తలనొప్పిగా ఉన్న సమయంలో కూడా టీ చక్కగా పనిచేస్తుంది. అయితే టీ తాగ‌డం వ‌ల్ల కూడా చ‌ర్మంపై మొటిమ‌లు వ‌స్తాయ‌ని మీకు తెలుసా..? 
వాస్త‌వానికి చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు.

 

యుక్తవయసులోనే కాదు కాస్త పెద్దయ్యాక కూడా ఎంతోమందిని మొటిమలు ఇబ్బందిపెడతాయి. అదీ ఆడవాళ్లలో అయితే ఎక్కువ‌ శాతం మంది వాళ్ల జీవితంలో ఒక్కసారయినా మొటిమల బారిన పడక తప్పదు. ఒత్తిడి, కాలుష్యం, నిద్ర లేకపోవడం మరియు అనారోగ్యకరమైన ఆహార ప్రణాళిక వంటివికూడా మొటిమల తీవ్రతకు కారకాలుగా ఉంటాయి. అయితే మ‌రి టీ సేవించడం, మొటిమల సమస్యకు ఏవిధంగా కారణం అవుతుంది ? దీనివెనుక ఉన్న అస‌లు నిజాలు ఏంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమల సమస్య తలెత్తిన పక్షంలో కెఫీన్ దానికి ప్రధాన కారణంగా చెప్తుంటారు. వాస్తవానికి కెఫీన్, మీ అడ్రినాలిన్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. 

 

క్రమంగా మాటలలో తడబాటు, అధిక ఒత్తిడి, నిద్రలేమి స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. క్రమంగా ఇటువంటి సమస్యలన్నీ.. మొటిమలకు ఖచ్చితంగా దారితీస్తాయి. అలాగే మొటిమ‌ల‌కు రావ‌డానికి టీ రకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. పాలు మరియు చక్కెర కలిపిన టీ, చర్మ ఆరోగ్యానికి ఎట్టిపరిస్థితుల్లో మంచిదికాదు. పాల ఉత్పత్తులు చర్మ సమస్యలకు దారితీస్తాయి. ఇక‌ పాలు సెబం ఉత్పత్తిలో కీలకపాత్రను పోషించడం వల్ల‌ ఇది అధిక చమురు మొటిమలకు దారి తీస్తుంది. కాబ‌ట్టి, పాలు చక్కెరలతో కూడిన టీ సేవించడం మానుకుంటూ.. గ్రీన్ టీకు అల‌వాటు ప‌డితే మంచిదంటున్నా నిపుణులు.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: