ప్రతి అమ్మాయి అందంగా కనిపించాలని తహతహ లాడుతుంది. అందుకోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. ఎన్నో పద్ధతులు పాటించి,తమ  ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.  దీని వల్ల ముఖం మీద అప్లై చేసే క్రీములు వల్ల ముఖ అందం పెరుగుతుంది అనేది అపోహ మాత్రమే.శరీరం లోపల నుంచి సరైన పోషక విలువలు అందించడం వల్ల  ముఖానికి సహజ రంగులు తీసుకురావచ్చు. ఆ అందాన్ని  ఎలా తీసుకురావాలో?ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

 ఎర్ర ద్రాక్ష పండు:
ద్రాక్షపండుపై  తొక్క  ఎర్రటి గోధుమరంగు రెస్వెరాట్రాల్
అనే సమ్మేళనం తో కప్పబడి ఉంటుంది. ప్రస్తుతం చర్మ చికిత్స కోసం ఎక్కువగా రెస్వెరాట్రాల్ ను  ఉపయోగిస్తున్నారు.  ఎందుకంటే రెస్వెరాట్రాల్ లో శరీరంలో అవయవాలు నష్టాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మంపై కనిపించే ముడతలను, అతినీలలోహిత కిరణాల నుండి చర్మానికి నష్టం జరగకుండా ఆపుతుంది.  అంతేకాకుండా శరీరంలో కడుపు, పేగులు, కాలేయం తో పాటు రొమ్ములలో అభివృద్ధి చెందుతున్న క్యాన్సర్  కణాలను నివారించడానికి సహాయపడుతుంది.

వాల్నట్:
వాల్ నట్స్ తో చర్మానికి కావలసిన ఎన్నో ఉత్తమమైన పదార్థాలు మనకు లభిస్తాయి.వాల్నట్ లో అధికంగా విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మంపై బాహ్య వాతావరణ ప్రతికూల ప్రభావాల వల్ల కలిగే బ్లాక్ హెడ్స్ తో పాటు వైట్హెడ్స్,మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే నల్లటి మచ్చలను వాల్ నట్స్ ద్వారా తగ్గించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో వాల్నట్ తో తయారు చేసిన ఫేస్ స్క్రబ్స్, ఫేస్ వాష్  వంటివి ఎన్నో లభిస్తున్నాయి. వీటిని వాడడం వల్ల చర్మం పైన మృతకణాలు తొలగిపోయి చర్మ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.

 చిలకడ దుంపలు:
దీనినే తీపి  బంగాళదుంప అని కూడా అంటారు. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సూర్యకిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది.  చర్మ సమస్యల నుంచి దూరం చేసి చర్మాన్ని అందంగా మార్చుతుంది.ఈ విధంగా చేయడం వలన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది

మరింత సమాచారం తెలుసుకోండి: