ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.చాలా మంది అందవిహీనంతో బాధపడేవారు ఈ చిట్కాలను పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితాలని అందుకుంటారు.. జిడ్డు  చర్మంతో బాధపడేవారు  బొప్పాయి, వేప, ముల్తాన్ మట్టి, కచ్చుర్ సుగంధీ పౌడర్‌ను రోజువాటర్‌తో మిక్స్ చేసి ముఖానికి అపె్లై చేయాలి. 20నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జిడ్డు పోతుంది, మొటిమలు తగ్గుతాయి. పొడి చర్మంతో బాధపడేవారు గులాబి, చందనం, అల్మండ్ పౌడర్‌లు, పాలల్లో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి మెల్లగా మర్దన చేయాలి.


అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంలో పొడితనం పోయి, ముఖం కాంతివంతమవుతుంది.కళ్ల కింద నలుపు పోవాలంటే గులాబీరేకులపొడి, బొప్పాయి, పుదీనా పొడుల్లో, రెండు చుక్కల చందనం నూనె, అలోవీరా జెల్‌ని కలిపి కంటి చుట్టూ రాయాలి. ఓ పదినిమిషాల పాటు మెల్లిగా మర్దన చేయాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.రోజ్‌వాటర్‌లో చందనం, గులాబి, ఛాయపసుపు, దోసకాయ రసం, బొప్పాయి పొడి, ముల్తాన్ మట్టి కలిపి ముఖానికి రాయాలి. అరగంట ఆగి, గోరు నీటితో కడిగేయాలి.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: