ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది ముఖం జిడ్డుబారి, మొటిమల సమస్యలతో తరచూ బాధపడుతూ వుంటారు. అంతేకాదు ముఖం నల్లగా మారి అందవిహీనంగా మారి బాధపడుతూ వుంటారు. మీ ముఖం పై మచ్చలు, మొటిమలు, జిడ్డు తనం అంతా పోయి మీ ముఖం తెల్లగా మారాలంటే ఈ పద్ధతులు పాటించండి..నిమ్మలో బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ముఖంపై ఉన్న అన్ని రకాల మచ్చలను తగ్గిస్తుంది. ఒక స్పూన్ నిమ్మరసం,ఒక స్పూన్ దోసకాయ రసం తీసుకోని బాగా కలిపి ముఖానికి బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి. దోసకాయ మీ చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది.

అలాగే రెండు స్పూన్స్ శనగపిండిలో చిటికెడు పసుపు,ఒక స్పూన్ నిమ్మరసం లేదా పెరుగు ను కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి 20 నిముషాలు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ముఖాన్ని స్క్రబ్ చేయాలి.ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారడం ఖాయం. అలాగే ఒక స్పూన్ పాలు,తేనె మరియు నిమ్మ రసం తీసుకోని మృదువుగా పేస్ట్ చేయండి. దీనిని మీ ముఖానికి,మెడకు బాగా పట్టించి 20 నిముషాలు అయిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు-మూడు సార్లు చేస్తే,మీ చర్మం మీద అన్ని రకాల మచ్చలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.


ఒక గిన్నెలో ఒక స్పూన్ ఓట్ మీల్,పెరుగు మరియు టమోటో రసం తీసుకోని బాగా కలపాలి. మీ ముఖం,మెడకు బాగా పట్టించి 20 నిముషాల తర్వాత సాధారణ నీటి తో శుభ్రం చేయాలి. టమోటా రసం ఒక మంచి రక్తస్రావ నివారిణి అని పిలుస్తారు. అందువల్ల సహజంగా చర్మానికి అందాన్ని ఇస్తుంది. ఓట్ మీల్ సహజంగా మరియు శాంతముగా చర్మం ఎక్స్ ఫ్లోటింగ్ లో సహాయపడుతుంది.పెరుగు తేలికపాటి బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి చర్మ దోషాన్ని తొలగిస్తుంది. ఈ మాస్క్ ను స్క్రబ్ తో కూడా శుభ్రం చేయవచ్చు. ఈ మాస్క్ చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది. అలాగే సన్ తాన్ తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: