నాటి నుంచి నేటి వరకు ముఖం అందం కోసం, ఎంతో మంది అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా పోటీపడుతున్నారు. మరీ ముఖ్యంగా అందంగా ఉండడానికి మార్కెట్లో దొరికే,ఎన్నో రకాల రసాయనాలు కలిగిన క్రీములను తీసుకొచ్చి రాస్తుంటారు. అయితే వీటి వల్ల తక్షణ ఫలితం ఉన్నప్పటికీ,దీర్ఘకాలికంగా ఏదో ఒక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చాలామంది బుగ్గలపై,ముక్కుపైన, నుదిటి పైన,గడ్డం పైన ఇలా ప్రతిచోటా ఏదో ఒక నల్లటి మచ్చలు వచ్చి,అందరిని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా చాలా మందిలో మూతి చుట్టూ నల్లని వలయాలు గా ఏర్పడి, అసహ్యం గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య మరీ ముఖ్యంగా శీతాకాలంలో ఉండడం గమనార్హం. అయితే ఈ నల్లటి మచ్చలు ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇందుకోసం తాజా అలోవెరా ను తీసుకోవాలి. దీని పైన ఉండే ముళ్లను, పచ్చని భాగాన్ని తీసివేసి,లోపల గుజ్జును తీసుకోవాలి. అలాగే కొద్దిగా నిమ్మరసం, ఒక టేబుల్ స్పూను చక్కెర తీసుకోవాలి. ఈ మూడు పదార్థాలు మీ చర్మాన్ని లోపలి వరకు శుభ్రం చేస్తాయి. ఈ మూడు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి, నెమ్మదిగా రుద్దుతూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చక్కెర, నిమ్మరసం, కలబంద గుజ్జు శరీరంలోకి బాగా వెళ్లి,ముఖం మీద నల్లటి మృతకణాలు తొలగిపోయి, చర్మం తెల్లగా మారే అవకాశం ఎక్కువ. ఇలా చేయడం వల్ల రంధ్రాలలోని మలినాలు బయటకు వస్తాయి. అయితే ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసిన తర్వాత, పదినిముషాలు ఆరనిచ్చి,చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి.
ఆ తర్వాత చిన్న అలోవెరా ముక్క తీసుకొని,ముఖం మీద మసాజ్ చేయాలి. ఇది చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఒక 10 నిమిషాలు ఉంచి,ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మట్టి తీసుకొని, అందులో ఒక టేబుల్ స్పూన్ టొమాటో రసం, ఒక టేబుల్ స్పూన్ పచ్చిపాలు అన్ని కలిపి మిశ్రమంలా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిమిషాలు ఆరిన తరువాత, చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతిని పాటించిన తర్వాత ఏదైనా మాయిశ్చరైజ్ లోషన్ ఉపయోగించడం ఉత్తమం.
పైన చెప్పిన పద్ధతులను వారానికి రెండు లేదా మూడు సార్లు ఉపయోగించడం వల్ల,మూతి చుట్టూ ఉన్న నలుపు తగ్గడమే కాకుండా,ముఖం మీద వున్న నల్లటి మచ్చలు కూడా తొందరగా తొలగిపోతాయి. ఫలితం గా ముఖం కాంతివంతంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి