ప్రతి ఒక్కరికి కుంకుమ పువ్వు అనగానే గుర్తుకు వచ్చే  మొదటి విషయం గర్భవతులు.. ఎందుకంటే మహిళలు గర్భవతులుగా ఉన్న సమయంలో ఎక్కువగా కుంకుమపువ్వును, పాలల్లో కలిపి తీసుకోమని చెప్తూ ఉంటారు.. ఎందుకంటే కుంకుమపువ్వు వల్ల పుట్టబోయే బిడ్డ కూడా ఎంతో అందంగా పుడతారు అన్న ఒక కారణం చేత కుంకుమపువ్వు తినాలి అని చెప్తారు.. అయితే కేవలం కుంకుమపువ్వు వారికి మాత్రమే కాకుండా ఎలాంటి వారైనా అందం కోసం ఉపయోగించుకోవచ్చు..


సాధారణంగా అందం అంటే కేవలం ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు, శరీరం కూడా అందంగా,  మేనిఛాయ అద్భుతంగా  ఉంటేనే అందమైన ముగువలు అని అంటారు. తల నుండి పాదాల వరకు చర్మం కాంతులీనినప్పుడే దానికి సంపూర్ణత్వం వస్తుంది.. కానీ పోను పోను పెరుగుతున్న కాలుష్యానికి చర్మం అందవిహీనంగా తయారవుతోంది.. దుమ్ము,ధూళి,ఎండ కారణంగా చర్మం సహజంగా  తేమను కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది.. అయితే మరి చర్మానికి సహజసిద్ధంగా అందాన్ని తీసుకురావాలి అంటే..కుంకుమ పువ్వు చాలా బెటర్ అంటున్నారు సౌందర్య నిపుణులు..  మరి ఎలా కుంకుమపువ్వు మేని సౌందర్యాన్ని పెంపొందిస్తుందో తెలుసుకుందాం..


పాల నురుగు లాంటి మేనిఛాయ మన సొంతం చేసుకోవడానికి, ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పదార్థం కుంకుమపువ్వు.. ఈ కుంకుమ పువ్వు ను ఎలా ఉపయోగించాలి అంటే.. ఒక అర కప్పు పెరుగు, అర టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు, ఒక టేబుల్ స్పూన్ తేనె అన్నీ కలిపి మిశ్రమంలా తయారు చేయాలి..ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి పై పూతగా పూసి, 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.. పెరుగు, తేనె చర్మానికి తగినంత తేమను అంధించడంతో పాటు, చర్మం తేమను కోల్పోకుండా చేస్తాయి. అంతేకాక  ముఖం మీద ఏర్పడిన మచ్చలు, మొటిమలు కూడా తొలగిపోతాయి.


ఇక కుంకుమపువ్వు మేని ఛాయను మెరుగుపరచి మిల్క్ బ్యూటీ లా కనిపించేలా చేస్తుంది.. సో మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ చిన్న చిట్కాలు పాటించి మీరు కూడా అందమైన అమ్మాయిలు గా మారిపోవడానికి ప్రయత్నం చేయండి.. ఇక ఈ పద్ధతులు గనక మీరు పాటించినట్లయితే మిమ్మల్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు.. అందులో ఎలాంటి సందేహం లేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: