ఇక చుండ్రు సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. జుట్టును సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వాతావరణ కాలుష్యం ఇంకా అలాగే తలపై ఉండే చర్మం పొడిబారడం వంటి వాటిని చుండ్రు సమస్య తలెత్తడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ చుండ్రు కారణంగా దురద, జుట్టు రాలడం వంటి  సమస్యలు వస్తాయి. చుండ్రును నివారించడానికి మార్కెట్ లో ఎన్నో రకాల షాంపులు మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడినా కూడా ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడుతున్న వారు  చాలా మంది  ఉంటారు.మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్న ఆ చుండ్రును ఒక టిప్ ని ఉపయోగించి నివారించుకోవచ్చు.చుండ్రును నివారించే ఆ టిప్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చుండ్రును తొలగించడంలో  కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకులో జుట్టు పోషణకు అవసరమయ్యే చాలా పోషకాలు ఉన్నాయి. జుట్టు కుదుళ్లకు కావల్సిన పోషకాలను అందించి జుట్టు కుదుళ్లను ధృడంగా చేయడంలో కరివేపాకు  బాగా సహాయపడుతుంది.


కరివేపాకులో యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి చుండ్రును నివారించడంలో చాలా బాగా సహాయపడతాయి. కరివేపాకును వాడడం వల్ల చుండ్రు సమస్యతో పాటు ఇతర జుట్టు సంబంధింత సమస్యల నుండి కూడా ఈజీగా బయటపడవచ్చు.అలాగే చుండ్రును తగ్గించడంలో  నిమ్మకాయ కూడా బాగా ఉపయోగపడుతుంది. చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో ఈ నిమ్మకాయ  బాగా సహాయపడుతుంది. కరివేపాకును, నిమ్మకాయను ఉపయోగించి చుండ్రు సమస్యను నివారించే టిప్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి.తరువాత ఇందులో గుప్పెడు కరివేపాకు ఆకులను వేసి చిన్న మంటపై ఒక 10 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.తరువాత ఈ నీళ్లలో నిమ్మకాయ రసాన్ని పిండి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నీళ్ళని తలకు, జుట్టుకు బాగా పట్టించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: