మీ పెదాలు సాఫ్ట్ గా గులాబి రంగులో మారాలంటే మసూర్ పప్పు, ఆవాల నూనె తీసుకోవడం చాలా మంచిది.ఎందుకంటే ఈ రెండు కూడా చర్మాన్ని ఖచ్చితంగా కాంతివంతం చేస్తాయి. అలాగే టాన్ ని వదిలించుకోవడానికి ఇంకా పెదాలు నల్లబడకుండా నిరోధించడానికి కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి.ఎందుకంటే ఈ నూనెలో విటమిన్ ఇ ఉంటుంది. పొడి పెదవులను ఇది మృదువుగా తేమగా చేయడమే కాకుండా మంచి రంగులోకి కూడా మారుస్తుంది.పాలు ఇంకా గులాబీ రేకులు రెండూ మంచి సహజమైన మాయిశ్చరైజర్లుగా పని చేస్తాయి. గులాబీ సారం పెదవులకు ఖచ్చితంగా హైడ్రేషన్ ఇస్తుంది. మీరు రాత్రిపూట 5-6 గులాబీ రేకులు అరకప్పు పాలలో నానబెట్టుకోని ఉదయం పాల నుందహి రేకుల్ని తీసి ముద్దలా తయారుచేసుకోని ఇక ఈ పేస్ట్ ని పెదాలకు అప్లై చేసి ఒక 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఈ పేస్ట్ రాసుకోవడానికి మందంగా అనిపిస్తే అందులో కొన్ని పాలని కూడా కలుపుకోవచ్చు.


ఇంకా అలాగే బీట్ రూట్ సహజంగానే ఎర్రగా ఉండటం వల్ల చాలా మంచి ఎక్స్ ఫోలియంట్ గా పని చేస్తుంది. పెదవులకు దీనితో మసాజ్ చేయడం వల్ల మృతకణాలు చాలా ఈజీగా తొలగిపోతాయి. బీట్ రూట్ ముక్కలు పెదవులపై మసాజ్ చేసుకోవడం కూడా చాలా సులభం.దీని రసం కూడా రాసుకోవచ్చు.అలాగే తాజా కలబందని తీసుకుని వాటి మధ్యలో ఉండే జెల్ ని బయటకి తీసుకోని కొబ్బరి లేదా ఆలివ్ నూనె రెండు చుక్కలు అందులో జోడించుకోవాలి.తరువాత ఒక గిన్నెలో పెట్టుకుని దాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు.ఇక ప్రతిరోజు ఎన్ని సార్లు అయినా దీన్ని మీరు మీ పెదాలకు రాసుకోవచ్చు.అలాగే ఒక టీ స్పూన్ పాలు ఇంకా అర టీ స్పూన్ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఈ పేస్ట్ ఆరిన తర్వాత సున్నితంగా కడగాలి. ఇక మీరు గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకున్నాక మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ ను అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: