నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ. ముఖ్యంగా జుట్టు రాలిపోవడం అన్నది ఈ రోజుల్లో  చాలా పెద్ద సమస్యగా మారిపోయింది.అయితే ఈ హెయిర్ ఫాల్ తగ్గడం కోసం చాలామంది హోం రెమిడీస్ ని ఫాలో అవ్వడంతో పాటు మార్కెట్లో దొరికే రకరకాల షాంపులు కూడా వాడుతూ ఉంటారు. హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా రకాల చిట్కాలను బ్యూటీ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తమలపాకుతో కొన్ని టిప్స్ పాటించడం వల్ల మళ్లీ జుట్టు  రాలేదు. ఇంకా హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. మరి హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే తమలపాకుతో ఏం చేయాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.


ఇందుకోసం మనం ఒక ఆరు తమలపాకులను తీసుకోవాలి.ఆ తర్వాత మందారం ఆకులను కూడా తీసుకోవాలి. అయితే మందారంలో ఎలాంటి ఆకులు తీసుకోవాలి అన్న సందేహం రానే వస్తుంది. ఒంటిరకం మందారం ఆకులను తీసుకోవడం వల్ల అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడోది కరివేపాకు. జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఈ కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మూడింటిని తీసుకున్న తర్వాత కొబ్బరి నూనెను కూడా మీరు తీసుకోవాలి.స్టవ్ ని ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆ నూనె వేసి స్లిమ్ లో పెట్టి మూడు ఆకులను ఆ నూనెలో వేసి బాగా మరిగించాలి.తరువాత మధ్య మధ్యలో స్పూన్ పెట్టి తిప్పుతూ ఉండండి. ఆకులు తొందరగా మాడిపోతే వాటిలో ఉన్న పోషక తత్వాలు నశించకపోతాయి కాబట్టి అలాగే తిప్పుతూ ఉండాలి. ఆ నూనె బాగా వేడి అయ్యి ఆకులు కాస్త లైట్ కలర్ లోకి మారిపోయిన తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆ నూనె చల్లారే దాకా ఆ ఆకులను కూడా అందులోనే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తూ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య ఈజీగా తగ్గడంతో పాటు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవు. ఇంకా అంతేకాకుండా జుట్టు కూడా చాలా బాగా ఒత్తుగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: