పేద ప్రజలకు సైతం ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా కింద దివ్యాంగులకు ,వృద్ధులకు ,వితంతువులకు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారికి ప్రతినెల పింఛన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పింఛన్ కోరుతూ వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హత కలిగిన వారికి ఈ కొత్త పింఛన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ఈ రోజున (డిసెంబర్ 1) తేదీ నాటికి 8190 పింఛన్లను అందించనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ప్రతినెల రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో పర్యటించి మరి స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పించిని సొమ్ముని చేతికి అందిస్తున్నారు. అలాగే వారి ఇంటి యొక్క బాగోగులను కూడా తెలుసుకుంటున్నారు.. ఈ రోజున ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెం గోపినాథపట్నంలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. అక్కడ ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్ పంపిణీతో పాటు అక్కడ కార్యకర్తలతో కూడా సమావేశం కాబోతున్నారు.



గొల్లగూడెంలో గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుడ్లనాగలక్ష్మి ఇంటికి వెళ్లి అనంతరం ఆమెకు పింఛని అందించి , ఆ తర్వాత నల్లమాడులో జరిగే ప్రజా వేదిక కార్యక్రమానికి  హాజరై అక్కడ సమస్యలను తెలుసుకోబోతున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఎన్టీఆర్ భరోసా కింద అందించే పింఛన్లను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతినెల మాదిరిగానే ఈ నెల కూడా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి మరి పింఛన్ అందించేలా మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పింఛన్ల పంపిణీ విభాగంలో లబ్ధిదారుల వివరాలను సేకరించి అనర్హుల జాబితాలను కూడా గుర్తించాలని అలాగే కొత్త దరఖాస్తుల పరిశీలన చేసి అనంతరం బోగస్ సర్టిఫికెట్ల ద్వారా ఎవరైనా పింఛన్ తీసుకుంటున్నట్లు అయితే వారి మీద చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: