కొండపల్లి రిజర్వు ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందంపై వైసీపీ కార్యకర్తలు కొందరు దాడికి దిగారు. వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులే తమపై దాడికి దిగినట్టు టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. బూతులు తిడుతూ తనపై దాడికి పాల్పడినట్టు టీడీపీ నేత పట్టాభిరాం వద్ద పనిచేస్తున్న అజయ్ చెప్పారు.