F3 సినిమాలో మూడో హీరోకి చోటు లేదని తేలిపోయింది. ఈసారి కూడా వెంకీ, వరుణ్లే కనిపిస్తారు. ఎఫ్ 3 కోసం అనిల్ రావిపూడి రాసుకున్న స్క్రిప్టులో మరో కీలకమైన పాత్ర వుంది. అందులో హీరోనే నటించాలి. కానీ.. ఇప్పుడు దాన్ని తొలగించారని సమాచారం. ఆ స్థానంలో ఓ మాజీ హీరోయిన్ ని రంగంలోకి దింపాలని చూస్తున్నార్ట. విజయశాంతి, రోజాలు చేయాల్సిన పాత్ర అదని, ఓ రకంగా ఆ పాత్రే మూడో హీరో అని తెలుస్తోంది. ఈ సినిమాలో మాత్రం నలుగురైదుగురు హీరోయిన్లు కనిపిస్తారని సమాచారం. ఓ ప్రత్యేక గీతం కూడా ఉండబోతోందని, అందులోనూ ఐటెమ్ గాళ్ గా ఓ ప్రముఖ హీరోయినే మెరవనుందని తెలుస్తోంది.