విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన గురించి సీఎం కేసీఆర్ స్పందించారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ దుర్ఘటన దురదృష్టకరం, బాధాకరం అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఈ ఘటన గురించి స్పందించారు. విషవాయువు లీక్ ఘటనపై షాక్ అయినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరూ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
మృతుల కుటుంబాలకు కేటీఆర్ సానుభూతి వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు పది మంది ఈ ఘటనలో మృతి చెందారు. దాదాపు 2000 మంది అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన గురించి ప్రధాని మోదీ సీఎం జగన్ కు కాల్ చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో సీఎం జగన్ విశాఖ చేరుకోనున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: