దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న తరుణంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా వల్ల ఆగిపోయిన పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. విద్యార్థులకు కరోనా సోకకుండా పరీక్షలు నిర్వహించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్ర పభుత్వాలు పరీక్షల తేదీలను ప్రకటించాయి. 
 
అయితే తాజాగా ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం పది, ఇంటర్ విద్యార్థుల పరీక్షల  సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు పరీక్షలు రాయకుండానే అందరినీ పాస్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ప్రభుత్వం నుంచి ఈ మేరకు కీలక ప్రకటన వెలువడింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం అంత శ్రేయస్కరం కాదని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: