ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. మంత్రి కన్నబాబు సీఎం జగన్ కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించడంపై హిస్టారికల్ సీఎం అంటూ ప్రశంసించారు. గతంలో ఏ సీఎం ఆదుకోని విధంగా జగన్ బాధితులను ఆదుకున్నారంటూ ఆకాశానికెత్తేశారు. సీఎం జగన్ మాట్లాడూ బాధితులకు ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని చెప్పారు. 
 
తప్పు జరిగిందని నివేదిక వస్తే ఎవర్నీ ఉపేక్షించమని అన్నారు. కేంద్రం నుంచి మూడు కమిటీలు వచ్చి పరిశీలించాయని... నివేదికలు అందాల్సి ఉందని సీఎం చెప్పాఉర్. బాధితులందరికీ ప్రభుత్వ సాయం ఇప్పటికే అందిందని చెప్పారు. సీఎం జగన్ మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, కృష్ణదాస్, విశాఖ కలెక్టర్, అధికారుల పనితీరును ప్రశంసించారు. కన్నబాబు, ఇతర మంత్రులు వెళ్లి బాధిత గ్రామాల్లో బస చేయడంతో ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: