ఈ మధ్యకాలంలో జమ్మూకాశ్మీర్ లో వరుసగా భారత సైనికులు ఉగ్రవాదులను మట్టు పెడుతున్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం సిఆర్పీఎఫ్ జవాన్ల ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి.
ఇక ఎన్కౌంటర్లో ఒక సీఆర్పీఎఫ్ జవాను కూడా అమరుడయ్యాడు. ఆర్మీ 55వ రాష్ట్రీయ రైఫిల్, 182 బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవాన్లు పుల్వామా బంద్ జు ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా... అక్కడే ఉన్న ఓ ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు భారత బలగాలపై కాల్పులకు తెగబడ్డారు దీంతో అప్రమత్తమైన బలగాలు ఒక్కసారిగా షూటింగ్ ప్రారంభించడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి