మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా.....? బ్యాంక్‌లో డబ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా? లేక పోస్టాఫీస్ లో మీ డబ్బులను దాచుకుంటున్నారా...? అయితే మీరందరూ తప్పనిసరిగా 15జీ, 15హెచ్ ఫామ్స్‌ను బ్యాంక్ కు వెళ్లి అందజేయాల్సి ఉంటుంది. రేపటిలోపు వీటిని బ్యాంకుకు వెళ్లి అందజేయకపోతే డిపాజిట్ చేసిన మొత్తంపై వచ్చే ఇంట్రస్ట్ నుంచి టీడీఎస్ కట్ అవుతుంది. దీంతో తక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది.
ఫైనాన్సియల్ ఇయర్ లో ఎఫ్‌డీలపై ఇంట్రస్ట్ నిర్ణీత పరిమితిని దాటితే అప్పుడు బ్యాంకులు టీడీఎస్ కట్ చేసుకుంటాయనే సంగతి తెలిసిందే. డిపాజిట్లు ట్యాక్స్ పరిధిలోకి వచ్చేంత ఆదాయం తమకు రాదని తెలియజేస్తూ వినియోగదారులు ఫామ్ 15జీ, ఫామ్ 15హెచ్ లను బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. 60 ఏళ్లలోపు వయసు కలిగిన వారికి 15జీ ఫారం వర్తిస్తుంది. 60 ఏళ్లు దాటిన వారు అయితే ఫామ్ 15 హెచ్ ఇవ్వాల్సి ఉంటుంది. సంవత్సరం వరకు ఈ ఫామ్స్ కు వ్యాలిడిటీ ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి