ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24గంటల్లో  ఏకంగా ఏపీలో 2593 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో  ఈ రోజే రికార్డు స్థాయి కేసులు అని చెప్పాలి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 38,044 కేసులు నమోదయ్యాయి. ఇందులో 18,159 కేసులు యాక్టివ్ గా ఉండగా 19,393 మంది ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు.




అంతేకాదు గడచిన 24 గంటల్లో ఏపీలో ఏకంగా 40 మంది కరోనా  వైరస్ బారినపడి మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 492 కు చేరింది. ఇక ఈరోజు  నమోదైన 2593 కేసుల్లో  2583 కేసులు ఏపీకి చెందినవి కాగా మిగతా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వారివి . జిల్లాల వారీగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఐదు వందల కేసులు నమోదయ్యాయి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: