గుడివాడ లో ఎమ్మెల్సీ అశోక్ బాబు మంత్రి కొడాలి నాని  పై తీవ్ర విమర్శలు చేసారు. గుడివాడ లో మంత్రి కొడాలి నాని అనుచరుల దాడికి గురైన టీడీపీ నాయకులను పరామర్శించిన ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మంత్రి కొడాలి నాని అధికార బలంతో ప్రశ్నించిన వారిపై దాడి చెయ్యడం హేయమైన  చర్య  అని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.

దాడి జరిగిన వారు పోలీసులకు పిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం పోలీసుల చేతకాని తనం  అని ఆయన మండిపడ్డారు. కొడాలి నాని, తన మంత్రి పదవిని అభివృద్ధికి వినియోగించాలి కానీ ఇలా  ప్రతి పక్షాలపై దాడులకు కాదు అని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదు,టీడీపీ అధికారంలోకి వస్తే అంతకు రెండింతలు చర్యలు తీసుకుంటాం  అని ఈ సందర్భంగా  ఎమ్మెల్సీ అశోక్ బాబు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: