నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరుపై హైకోర్టు ఆగ్రహం... ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ బ్రేకింగ్ న్యూస్ చదవండి... ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించట్లేదు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో మూడవ రోజు విచారణ జరిగిందని తెలిసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈసీ కి సహకరించడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరోపించారు. ఈసీ కి 40 లక్షల సొమ్ము రావాల్సిందని కానీ అవి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రానివ్వలేదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వారి దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం తరపున న్యాయవాది ప్రభుత్వం ఇప్పటికే 39 లక్షలు జమ చేసిందని గుర్తు చేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్..  

ఎన్నికల కమిషన్ లో కొన్ని పోస్టులని ప్రభుత్వం భర్తీ చెయ్యలేదని నిమ్మగడ్డ ఆరోపించారు. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎత్తి చూపింది. హైదరాబాద్ లోని తన నివాసం వద్ద పని చేసేందుకు అడిషనల్ అటెండర్  పోస్టులు భర్తీ చేయాల్సిందిగా  ప్రభుత్వానికి నిమ్మ గడ్డ రమేష్ కుమార్  లేఖ రాసినట్లు తెలిపారు.


హైదరాబాద్ లోని తన నివాసాన్ని అధికారిక నివాసంగా ప్రకటించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గౌరవంగా వాదించారు. ఇక నిమ్మగడ్డ తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ లో ఒక అధికార నివాసం, హైదరాబాద్ లో ఒక నివాసం ఎందుకని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని హైకోర్టు ప్రశ్నించింది. ఇది పూర్తిగా ప్రజాధనాన్ని వృధా చెయ్యటం అని హై కోర్టు తెలియజేసింది. మొత్తానికి ఈ విషయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కి చుక్కెదురైంది.. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

https://youtu.be/rhAg9kJpap0



మరింత సమాచారం తెలుసుకోండి: