గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కీలకంగా మారిన నేపధ్యంలో ఇప్పుడు ప్రచారం విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉంటున్నారు తెరాస నేతలు. ఈ తరుణంలో ఒక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ రోడ్ షో తో భారీగా ట్రాఫిక్ జాం అయింది. రోడ్లపైకి వేలాదిగా వచ్చిన టిఆర్ఎస్ కార్యకర్తలతో ట్రాఫిక్ ఆగింది.  బాలనగర్  వై జంక్షన్ నుంచి నర్సాపూర్ చౌరస్తా వరకు.. చింతల్ నుంచి బాలానగర్ వరకు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

3 గంటలుగా ట్రాఫిక్ లో వాహనదారులు నరకం చూస్తున్నారు. నేటి నుంచి 28 వరకు వరుసగా సిటీ లో కేటీఆర్ రోడ్ షో లతో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. రద్దీ ఎక్కువగా ఉండే సాయంకాలం వేళల్లో రోడ్ షో కు పోలీసులు అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి అల్లాపూర్, మోతీ నగర్, మూసాపేట్ మార్గాల్లో కుత్బుల్లాపూర్ చింతల్ వరకు కేటీఆర్ రోడ్ షో కొనసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: