మహారాష్ట్రలో నెలకొన్న ఆక్సిజన్ కొరత తీర్చాలంటూ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేసి మాట్లాడారని వస్తున్న వార్తలపై మంత్రి నవాబ్ మాలిక్ స్పందించారు. రాష్ట్రంలో నెలకొన్న ఆక్సిజన్ కొరతపై ప్రధానితో మాట్లాడటానికి ముఖ్యమంత్రి ప్రయత్నించారని, కానీ ఆయన అందుబాటులోకి రాలేదన్నారు. ప్రధాని బెంగాల్ పర్యటనలో ఉన్నారని అధికారుల నుంచి సమాధానం వచ్చిందని నవాబ్ మాలిక్ చెప్పారు. కరోనాతో ఓవైపు ప్రజలు చనిపోతుంటే మోడీ ఎన్నికల్లో బిజీగా ఉన్నారంటూ నవాబ్ మాలిక్ విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలో నమోదువుతున్న కరోనా కేసుల్లో అత్యధికం ఆ రాష్ట్ర ప్రధాన నగరాల్లోనే నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్యలో దేశంలో నమోదువుతున్నవాటిలో 60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి. ఇప్పటికే పలువురు వీఐపీలు ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ బుక్ చేసుకున్నారు. అవసరమైతేనే బయటకు రావాలంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ప్రజలకు సూచిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి