హైదరాబాద్ : ములుగు
ఎమ్మెల్యే సీతక్కతన తల్లిని కాపాడుకోవడానికి కన్నీరు పెడుతుంది.మొదటి దశ కరోనా నుంచి ఇప్పటివరకు కష్టాన్ని,భయాన్ని మరిచి పేద ప్రజలకు నిత్యవసరవస్తువులు ఇవ్వడానికి అడవుల్లో సైతం సీతక్క తిరిగింది.అలాంటి సీతక్క ఇప్పుడు తన తల్లిని కాపాడుకోవడానికి ఆవేదన చెందుతుంది.తన తల్లి కరోనాతో హైదరాబాద్‌లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే ఆమెకు బడ్ల్ అవసరమవ్వడంతో ములుగు నుంచి సీతక్క తన బంధువులను హైదరాబాద్‌కి పంపించారు.అయితే తన బంధువులపై డీసీపీ రక్షిత అసభ్యకరంగా ప్రవర్తించారని..తన తల్లికి బ్లడ్ ఇచ్చేందుకు వెళ్తున్నారని చెప్పిన డీసీపీ వినలేదని సీతక్కతెలిపింది.ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి వెహికల్ పర్మిషన్ తీసుకున్నానని చెప్పినా పోలీసులు వినకుండా దుర్భాషలాడటంపై సీతక్క ఆవేదన చెందారు.
ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పరిస్థితే ఇలా ఉంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని సీతక్కతన ఆవేదన వ్యక్తం చేశారు.