వాషింగ్టన్ నుంచి రికి ఎల్ పాండ్ గుర్తున్నాడా.? అదేనండి బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలను పోస్ట్ చేసి ఈ ఏడాది ప్రారంభంలో బాగా వైరల్ వ్యక్తి.. ఇప్పుడు మరొక అద్భుతమైన పాటతో తన ఫాలోయర్స్ కి ఐ ఫీస్ట్ ఇచ్చాడు. ఈ సారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో, రికి తన నివాసంలో దలేర్ మెహందీ 1995 లో స్వరపరిచిన హిట్ పాట అయినా బోలో టా రా రా అనే ట్రాక్ కి డ్యాన్స్ చేస్తూ ఒక చిన్న క్లిప్‌ను పోస్ట్ చేశాడు. ఈ పాటలో రికి ఎంతో ఉత్సాహంతో పాటకు నృత్యం చేయడంతో మరోసారి వైరల్ గా మారుతున్నాడు. ఇక తాను ఈ క్లిప్ కి “బోలో టా రా రా. మీరు ఏమనుకుంటున్నారు అంటూ పోస్ట్ కి కాప్షన్ పెట్టాడు. ఇక ఈ వీడియోస్ కి సోషల్ మీడియాలో రికీ ఫాలోయర్స్ సూపర్ గా కామెంట్ చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: