ఆధునిక సమాజంలో కూడా అత్తా మామలు కొందరు కోడళ్ళ విషయంలో కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా విజయవాడలో ఒక ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి కృష్ణానది వద్ద ఇద్దరి పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యయత్నం చేయడం సంచలనం అయింది. విజయవాడ నాలుగు స్తంభాలకు చెందిన శాంతి ప్రియగా గుర్తించారు. వెంటనే నదిలో దిగి ఇద్దరు పిల్లలను, శాంతి ప్రియను మత్స్యకారులు కాపాడారు.

మామ వేధింపులు తాళలేక ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. గతంలో భర్త రెండు కిడ్నీలు చెడిపోతే భర్తకు ఒక‌ కిడ్నీదానం చేసింది శాంతి ప్రియ.   కనికరం లేకుండా వేధిస్తుండటంతో పిల్లలతో సహా ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మామను స్టేషన్ కి పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: