తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని గుడ్ న్యూస్ చెప్పింది. పదోన్నతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు సిఎం కేసీఆర్. ఉద్యోగుల పదోన్నతికి కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నేడు ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేసారు. న్యాయపరమైన చిక్కులున్నవాళ్ళు మినహా 120 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తుంది.

సెక్షన్ ఆఫీసర్లుగా 59 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ప్రమోషన్ వస్తుండగా అసిస్టెంట్ సెక్రెటరీలుగా 33 మంది సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ సెక్రెటరీలుగా 20 మంది అసిస్టెంట్ సెక్రెటరీలు పదోన్నతులు పొందుతారు. జాయింట్ సెక్రెటరీలుగా 8 మంది డిప్యూటీ సెక్రెటరీలకు ప్రమోషన్ వస్తుంది. అడిషనల్ సెక్రెటరీలుగా నలుగురు జాయింట్ సెక్రెటరీలకు పదోన్నతులు లభిస్తాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: