మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ముగిసాక కూడ రోజు రోజుకు ఓ స‌రికొత్త ట్విస్ట్‌లు వ‌స్తున్నాయి. సోమ‌వారం పోలీసులు  జూబ్లీహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ వ‌ద్ద‌కు చేరుకొని  స‌ర్వ‌ర్ రూమ్‌ను ప‌రిశీలించారు. తాజాగా ప్ర‌కాశ్‌రాజ్ కూడా అక్క‌డికి చేరుకున్నారు. మీడియాతో ముచ్చ‌టించారు. కొన్ని కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా మాకు ఎన్నిక‌ల్లో అధ్య‌క్షునిగా గెలిచిన మంచు విష్ణుతో అస‌లు స‌మ‌స్య లేదు. కానీ ఎన్నిక‌ల అధికారిగా వ్య‌వ‌హ‌రించిన కృష్ణ‌మోహ‌న్‌పై ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. సీసీ పుటేజీల‌ను ప‌రిశీలించ‌డం పూర్త‌య్యాక అస‌లు విష‌యాలు వెలుగులోకి వ‌స్తాయి.

మంచు విష్ణు గెలిచారు. అత‌ని కుటుంబ స‌భ్యులతో పాటు గెలిచిన ప్యాన‌ల్ స‌భ్యులు కూడా శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు.  సంతోష‌క‌రం. రాజీనామాలు త‌మ‌కు అంద‌లేద‌ని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానాన్ని దాట‌వేశారు. ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్‌కు రాజీనామా లేఖ రాశాను. రిప్లై ఇవ్వ‌లేదు. ఎన్నిక‌ల రోజు ఆ స్కూల్లో నెల‌కొన్న ఉద్రిక్త త వాతావ‌ర‌ణంపైనే మేము పోలీసుల‌కు ఫిర్యాదు చేశాం. పోలీసులు స‌ర్వ‌ర్‌రూమ్ ప‌రిశీలించాక అన్ని తెలుస్తాయ‌ని ప్ర‌కాశ్‌రాజ్ స్కూల్ లో ఉన్న స‌ర్వ‌ర్‌రూమ్ లోప‌లికి వెళ్లారు.


మరింత సమాచారం తెలుసుకోండి: