ముఖ్యంగా సినిమా షెడ్యూల్ మరియు వాయిదా గురించి బోయపాటి శ్రీను పలు విషయాలను తెలియజేశారు. తాను ఈ సినిమాని 135 రోజులలోపు పూర్తి చేశానని, కొబ్బరికాయ కొట్టిన రోజే సినిమా డేట్ ని కూడా అనౌన్స్మెంట్ చేశామని ఈ విషయం బాలకృష్ణ గారికి ముందే తెలియజేశాను.. మేము అనుకున్నట్టుగానే సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల చేద్దామనుకున్నాము. అందుకు సంబంధించి మొదటి కాపీ సిద్ధమయ్యింది. కానీ అదే సమయానికి పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా విడుదల తేదీని అనౌన్స్మెంట్ చేశారు.
ఇలా ఇండస్ట్రీలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల చేయడం కరెక్ట్ కాదనిపించింది. రెండు సినిమాలు కూడా బాగుండొచ్చు, కానీ థియేటర్ షేర్ అవుతాయి దీనివల్ల మన రెవిన్యూని మనమే ఇబ్బంది పెట్టుకున్నట్టుగా ఉంటుందనిపించిందని అప్పుడే బాలయ్య గారు.. ఈ డేటు తమ్ముడికి ఇచ్చేద్దాం మనం మళ్లీ వద్దామని చెప్పారు. అందువల్లే మేము ఆ తేదీ నుంచి పక్కకు తప్పుకున్నామని తెలిపారు బోయపాటి. ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా బాలకృష్ణ మరో సినిమాకు అవకాశం కల్పించడం అంటే అది మామూలు విషయం కాదు అది బాలయ్య గారి గొప్ప మనసుకు నిదర్శనమే అంటూ తెలిపారు బోయపాటి శ్రీను.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి