తెలంగాణ‌లో ఉన్న పుణ్య‌క్షేత్రాల‌లో యాద‌గిరిగుట్ట ఒక‌టి. దానికి తెలంగాణ ప్ర‌భుత్వం యాదాద్రి అనే పేరును తీసుకొచ్చింది. యాదాద్రి పుణ్య‌క్షేత్రాన్ని గ‌త నాలుగేళ్ల నుంచి పునఃప్రారంభంకు సంబంధించిన ప‌నులు చేప‌డుతున్నారు. కొత్త హంగుల‌తో తీర్చిదిద్దుతున్నారు. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు యాదాద్రిని సంద‌ర్శించి జ‌రుగుతున్న ప‌నుల‌న్నింటిని ప‌రిశీలించారు. అదేవిధంగా అక్క‌డ నిర్వ‌హించే సుద‌ర్శ‌న‌యాగం, మ‌హాసంప్రోక్ష‌ణ తేదిల‌ను ప్ర‌క‌టించారు సీఎం.

సీఎం కేసీఆర్ పిలుపు మేర‌కు మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ప్రాస్ట్ర‌క్ష‌ర్ లిమిటేడ్  యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహాస్వామి ఆల‌యం పునఃనిర్మాణానికి తాజాగా భారీ విరాళం ప్ర‌క‌టించింది. ఆల‌యంలో విమాన గోపురానికి బంగారం తాప‌డానికి 6 కేజీల బంగారాన్ని బ‌హుక‌రిస్తున్నామ‌ని ఆ సంస్థ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి వెల్ల‌డించాడు. 6 కిలోల బంగారం లేదా స‌మాన‌మైన న‌గ‌దు మొత్తాన్ని చెక్కురూపంలో అధికారుల‌కు అంద‌జేస్తామని ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ కుటుంబం నుంచి 16 తులాల బంగారం, హెటిరో గ్రూపు సంస్థ నుంచి 5 కిలోల బంగారం, మంత్రి మ‌ల్లారెడ్డి 2 కేజీలు అందులో కుటుంబం నుంచి 1కేజీ, నియోజ‌క‌వ‌ర్గం నుంచి 1 కిలో బంగారం, నాగ‌ర్ క‌ర్నూల్ ఎమ్మెల్యే జ‌నార్ధ‌న్‌రెడ్డి 2 కేజీలు, చిన‌జీయ‌ర్‌స్వామి మ‌ఠం నుంచి 1కేజీ ఇలా చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు బంగారాన్ని విరాళంగా ప్ర‌క‌టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: