హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రం కమలాపూర్ మండలంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. డబ్బు... మద్యం అక్రమ తరలింపును నియంత్రించేందుకు ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కమలాపూర్ లో ఇప్పటివరకు 330 మంది బైండోవర్స్ అయ్యారు. 20 లిక్కర్ కేసులు, 11లక్షల నగదు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. వివిధ రాజకీయ పార్టీలపై 11 కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్టు సమాచారం.

ప్రజలు స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే విధంగా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత ప్రాంతియేతరులు ఇక్కడి నుండి పోలీసులు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈరోజు తో హుజురాబాద్ లో ప్రచార పర్వం పూర్తవడం తో ఎన్నికలు ఎలా జరుగుతాయి అన్నదానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది .

మరింత సమాచారం తెలుసుకోండి: