అత్యంత ప్రతిష్టాత్మక హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ మొదలైంది. కలెక్టర్ కర్ణన్ వచ్చి వీణవంక పోలింగ్ బూత్ కు వచ్చి పరిశీలన చేసి వెళ్లారు. ఈటెల కూడా అలెర్ట్ గా ఉన్నారు. ఆయన కూడా పోలింగ్ కు సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు అందుకుంటున్నారు. ఇప్పటికే హుజురాబాద్ మండలం, కందుగుల పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. పోలింగ్ పై పూర్తి దృష్టి ఉంచాలని ఇక్కడ తన ఏజెంట్లకు చెప్పి వెళ్లారు. మరోవైపు గులాబీ దండు పోలింగ్ శాతం పెంచేందుకు తెగ ప్రయత్నిస్తున్నా రు. రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఈ ప్రాంతంలో జూన్ నెలలో ఈటెల రాజీనామా చేసిన నాటి నుంచి రాజకీయ డ్రామాలు నడుస్తూనే ఉన్నాయి. ఒకవేళ ఎన్నికల ఫలితం తేలినా కూడా రాజకీయం అయితే ఆగదు. ఇక డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసిన ఈటెల మరియు గెల్లు వర్గాలకు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. పోలింగ్ కు అంతా వస్తారా లేదా అన్నది వారి టెన్షన్. 30మంది అభ్యర్థులు తలపడుతున్న ఈ రణ క్షేత్రంలో గెలుపు ఎవరిది అయినా ఓడిపోయేది మాత్రం ఓటరే! మరోవైపు కేసీఆర్ కూడా ఈ ఎన్నికపై ఓ కన్నేసి ఉంచినా కూడా పైకి అదేమీ లేదన్న విధంగా నటిస్తుండడమే పెద్ద విడ్డూరం రా అబ్బయ్యా!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి