క‌డప జిల్లా  రాజంపేట మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ రోజు వెల్ల‌డి అవుతున్నాయి. అధికార వైసీపీ జోరు ముందు ఫ్యాన్ పార్టీ బేజారు అవుతోంది. రాజంపేట 27వ వార్డులో ఇండిపెండెంట్ రాఘవరాజు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. 19 వ వార్డు లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి డొంక.సురేశ్ -  21వ వార్డులో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కొండా వెంకట రమణ రెడ్డి విజయం సాధించారు.

అలాగే 24 వ వార్డు లో వైసిపి అభ్యర్థి చప్పిడి శ్వేతారెడ్డి 300 మెజార్టీతో విజయం సాధించారు. ఇక 4 వ వార్డులో వైసీపి అభ్యర్థి  రవి 50 ఓట్లు మెజార్టీతో గ‌ట్టెక్కారు. ఇక 17వ వార్డు లో వైసిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీనివాసులు రెడ్డి 600 ఓట్ల ఆధిక్యంతో విజ‌యం సాధించారు. దీంతో మునిసిప‌ల్ చైర్మ‌న్ భారీ మెజార్టీతో గెలిచిన‌ట్టు అయ్యింది. ఇక మిగిలిన వార్డుల కౌంటింగ్ స‌ర‌ళి చూస్తుంటే వైసీపీ ఇక్క‌డ బంప‌ర్ మెజార్టీతో విజ‌యం సాధించే ప‌రిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: